పిక్ టాక్‌ : దీపిక మ‌తి చెదిరే స్టైల్

Friday, April 6th, 2018, 07:24:06 PM IST

`ప‌ద్మావ‌త్` సినిమాతో దీపిక స్థాయి రెట్టింపైంది. ఆ క్ర‌మంలోనే ఈ విజ‌యం ఇచ్చిన ఉత్సాహంలో త‌న వ్య‌క్తిగ‌త‌ జీవితానికి కొత్త అర్థం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. బోయ్‌ఫ్రెండ్ ర‌ణ‌వీర్ సింగ్‌ని పెళ్లాడేందుకు ప్రిపేర‌వుతోంది. ఆ క్ర‌మంలోనే కొత్త సినిమాల‌కు సంత‌కాలు చేయ‌డం లేద‌ని బాలీవుడ్‌లో ప్ర‌చార‌మ‌వుతోంది. అంతేకాదు గ‌త కొంత‌కాలంగా దీపిక బెంగళూరు నుంచి ముంబైకి ప‌య‌న‌మ‌వుతోంది. త‌ల్లిదండ్రుల‌తోనే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తూ పెళ్లికి సంబంధించిన షాపింగులు చేస్తోంది. మొన్న‌టికి మొన్న ర‌ణ‌వీర్ త‌ల్లి కాబోయే కోడ‌లుకు ఓ అద్భుత‌మైన కానుక‌ను ఇవ్వ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

లేటెస్టుగా దీపిక స్ట‌న్నింగ్ లుక్‌తో క‌నిపించింది. ముంబై విమానాశ్రాయంలో అల్ట్రా మోడ్ర‌న్‌ క్యాజువ‌ల్ లుక్‌లో క‌నిపించింది. తెల‌తెల్ల‌గా మెరుస్తున్న టాప్‌పై అధునాత‌నంగా డిజైన్ చేసిన గ‌ళ్ల చొక్కా.. గ‌ళ్ల ఫ్యాంటుతో వెరీ స్పెష‌ల్‌గా అప్పియ‌రెన్స్ ఇచ్చింది. క‌ళ్ల‌కు బ్లాక్ క‌ల‌ర్‌ రేబాన్ ధ‌రించి చిరున‌వ్వులు చిందిస్తూ చిద్విలాసంగా క‌నిపించింది. ఇలాంటి కొత్త స్టైల్స్‌ని అనుక‌రించ‌డం దీపిక‌కు కొత్తేమీ కాదు, కానీ ఈ డ్రెస్‌లో సంథింగ్ స్పెష‌ల్‌గా క‌నిపించ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది.