ఫోటో టాక్ : వెరైటీ చీరలో దీపిక..హాట్ హాట్ గా..!

Monday, November 13th, 2017, 11:19:01 PM IST

బాలీవుడ్ భామ దీపికా పదుకునే ప్రస్తుతం హాలీవుడ్ స్థాయి సెలెబ్రిటీ. తాను ధరించే అవుట్ ఫిట్స్ తన స్థాయికి తగ్గట్లుగా, కొత్తదనం ఉండాలనేది దీపికా ఆలోచన. అలా డిఫెరెంట్ గా ట్రై చేసి అభిమానుల చేత విమర్శల పాలైన సందర్భాలు సైతం ఉన్నాయి. కాగా తాజాగా దీపికా పదుకొనె ధరించిన చీర లాంటి డ్రెస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చీరలాగే ఉంది..కానీ చీర కాదు. డిజైనర్ షలీనా నథాలి ఈ డ్రెస్ ని రూపొందించింది. పొడవాటి స్కర్ట్, వెరైటిగా ఉన్న బ్లౌజ్ మరియు దుపట్టా ఈ మూడింటి కాంబినేషన్తో ఈ డ్రెస్ ని రూపొందించారు. ఎప్పటిలాగే దీపికా అందాల ప్రదర్శనకు ఈ డ్రెస్ అడ్డు కాలేదు. దీపికా వెరైటీ డ్రెస్ కొందరిని అమితంగా ఆకట్టుకుంటుంటే, మరి కొందరు మాత్రం ఇదెక్కడి విడ్డూరం అని అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments