పిక్ టాక్‌ : చ‌ంద‌మామ‌లా న‌వ్విందే!

Friday, April 27th, 2018, 10:24:20 PM IST

ఆకాశంలో చంద‌మామ‌లా ఎంత ఆహ్లాదంగా న‌వ్విందో! ఆ న‌వ్వుతోనే కుర్రాళ్ల గుండెల్ని గుల్ల చేసేసింది దీపిక‌. ర‌ణ‌బీర్‌, ర‌ణ‌వీర్ వంటి స్టార్ల గుండె గూడు కొల్ల‌గొట్టింది. కోటానుకోట్ల మంది హృద‌యాల్లో అధినేత్రిగా వెలిగిపోతోంది అంటే ఆ న‌వ్వుకు ఉన్న ప‌వ‌ర్ ఆ స్థాయిలో ఉండ‌బ‌ట్టే.

ప‌ద్మావ‌త్ సినిమాలో ప‌ద్మినిగా చిరున‌వ్వులు చిందించిన దీపిక ఇలా ఓ ఫోటోషూట్‌లో న‌వ్వుతూ చుట్టూ ఆహ్లాదాన్ని పంచింది. మంచు ముత్యం క‌రిగి అది భూమ్మీదికి వ‌స్తే అచ్చం దీపిక‌లా ఉంటుందేమో అన్నంత బావుంది క‌దూ? దీపిక ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్‌ని పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతున్న వేళ జ‌నం క‌ళ్ల‌న్నీ త‌న‌పైనే.

  •  
  •  
  •  
  •  

Comments