లేడి డాన్ పాత్రలో .. దీపికా ?

Friday, October 5th, 2018, 09:36:31 PM IST


బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనె .. మరోసారి .. లేడి ఓరియెంటెడ్ సినిమాతో రెడీ అవుతుంది. ఇదివరకే పద్మావతి అంటూ వచ్చిన ఈమె బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. నటిగానే .. కాదు గ్లామర్ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇప్పుడు దీపికా లేడి డాన్ గా కనిపిస్తుందట .. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ప్రముఖ లేడి డాన్ స్వప్నా దీదీ కథతో ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమా మొదలు కావాల్సి ఉండగా .. ఇందులో కీ రోల్ పోషిస్తున్న ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. మరో వైపు దీపికా సినిమాలకు పులిస్టాప్ పెట్టి .. రణ్వీర్ సింగ్ తో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయిందంటూ బి టౌన్ లో జోరుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీపికా మరో సినిమాకు సైన్ చేయడం విశేషం.