దీపికా లవర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడట ?

Wednesday, July 25th, 2018, 11:16:27 PM IST


బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమాయణాలు ఇవాళా కొత్తేమి కాదు. ఈ పరంపర అనాదిగా సాగుతూనే ఉంది. ఇక లేటెస్ట్ ట్రెండ్ లో బాలీవుడ్ కుర్ర హీరోలతో క్రేజీ భామల ప్రేమాయణం ఓ రేంజ్ లో హంగామా క్రియేట్ చేసాయి. ఈ విషయంలో ఎక్కువుగా అందాల భామ దీపికా పదుకోన్, రణబీర్ కపూర్ ల ప్రేమాయణం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తరువాత రన్బీర్ కు బ్రేక్ అప్ చెప్పి .. ఆ తరువాత రణ్వీర్ సింగ్ ని లవ్ లో పడేసింది దీపికా ప్రస్తుతం రణ్వీర్ తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే అతగాడిని పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే రన్బీర్ తో ప్రేమాయణం ఎందుకు చెడిపోయింది అన్న దానికి సమాధానం చెప్పింది ఓ ఇంటర్వ్యూ లో .. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే ఆ అనుబంధానికి విలువ ఏముంటుంది .. అంటూ ఘాటుగా ప్రశ్నిచింది. అయితే రన్బీర్ కు దూరం కావడానికి ముఖ్య కారణం అతగాడు తనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడట. అందుకే అతగాడిని బ్రేక్ అప్ చెప్పానని చెప్పింది. అది దీపికా భగ్న ప్రేమకథ.

  •  
  •  
  •  
  •  

Comments