మహేష్ లేకున్నా జనగణమన తీసి తీరతానంటున్న పూరి ?

Monday, May 7th, 2018, 12:15:28 PM IST


ప్రస్తుతం ఫ్లాప్ లో ఉన్న పూరి జగన్నాధ్ తో సినిమాలు చేయడానికి ఏ స్టార్ హీరో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండస్ట్రీ అంటే అంతే .. ఇక్కడ కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఒక్కసారి ప్లాప్ వచ్చిందంటే ఎంత క్రేజ్ ఉన్న స్టార్ అయినా విలువ ఉండదు. ఇక టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న పూరి జగన్నాధ్ టైం ప్రస్తుతం అంత బాగా లేదు .. ప్రస్తుతం వరుస పరాజయాలతో టెన్షన్ పడుతున్న అయన మళ్ళీ ఫామ్ లోకి రావడానికి తన కొడుకు హీరోగా మెహబూబా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి తన తదుపరి చిత్రాన్ని మహేష్ తో తీయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు . జనగణమన పేరుతొ ఓ సినిమా తీయడానికి చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ కి కథ చెప్పాడు కానీ .. మహేష్ గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు .. అయినా సరే మహేష్ కోసం ఎదురు చూస్తున్న పూరి తన తదుపరి చిత్రాన్ని మహేష్ లేకున్నా వేరే హీరోతో అయినా చేస్తానని అంటున్నాడు. ప్రస్తుతం సమాజానికి ఇలాంటి సినిమాలు అవసరమని అందుకే తన ప్రయత్నం ఆపనని అంటున్నాడు. మరి ఈ సినిమా గురించి మహేష్ ఏమంటాడో చూడాలి.

Comments