గంబీర్ వర్సెస్ రహానే.. మొదటి విజయం కోసం యుద్ధం!

Wednesday, April 11th, 2018, 02:50:43 AM IST

మొదటి అడుగులోనే అపజయాన్ని చుసిన చూసిన రెండు జట్లు ఇప్పుడు విజయం కోసం తలపడబోతున్నాయి. అజింక్య రహానే సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ చేతిలో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అలాగే ఢిల్లీ డేర్ డెవిల్స్ కూడా మొదట పంజాబ్ తో ఆడిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. మొదట వేసిన తప్పటడుగులు మళ్లీ రిపీట్ కాకూడదని ఇరు జట్లు స్ట్రాంగ్ గా ప్రాక్టీస్ చేస్తున్నాయి. బుధవారం ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది.

రాజస్థాన్ రాయల్స్: అజింక్య రహానే కెప్టెన్సీ న్యాయకత్వం ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం కూడా కనిపించలేదు. నమ్ముకున్న ఖరీదైన ఆటగాళ్లు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. స్టోక్స్ – ఉనద్కట్ వైఫల్యం జట్టులో ఆత్మవిశ్వసాన్నీ దెబ్బ తీసింది. స్మిత్ లేని లోటు మొదటి మ్యాచ్ లోనే చాలా క్లియర్ గా కనిపించింది. సంజు శాంసన్ తప్పితే ఏ ఆటగాడు రాణించలేదు. బట్లర్, డి షార్ట్ వంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఫామ్ లోకి వస్తే జట్టు విజయాన్ని ఈజీగా అందుకోగలదు. మరి ఢిల్లీతో జరగబోయే మ్యాచ్ లో ఆటగాళ్లు ఎంతవరకు రాణిస్తారో చూడాలి.

ఢిల్లీ డేర్ డెవిల్స్: స్థానిక ఆటగాళ్లు ఉన్న బలమైన జట్టు ఢిల్లీ ఫస్ట్ మ్యాచ్ ను పంజాబ్ తో ఆడి ఓడిపోయింది. బ్యాటింగ్ లైనప్ లో గంబీర్ తప్పితే ఎవరు అక్కనుకున్నంత స్థాయిలో రాణించలేదు. ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ బాగానే ఆడినా బౌలింగ్ లో రానించి ఉంటే విజయం దక్కేది. మున్రో విజయ్ శంకర్ లాంటి సమర్ధవంతమైన ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. మున్రో ఫామ్ లోకి వస్తే బౌండరీలను ఈజీగా కొట్టగలడు. ఇంకా శ్రేయాస్ అయ్యర్ సెకండ్ మ్యాచ్ లో అయినా బాగా ఆడితే ఢిల్లీకి మొదటి విజయం దక్కుతుంది.