ఢిల్లీ..గజగజ వణికింది..!

Thursday, November 17th, 2016, 10:02:18 AM IST

road-crack
దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో గురువారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. స్వల్ప భూకంపమే అయినా ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై భూకంపతీవ్రత 4.4 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.హర్యానా లోని భావల్ కు 13 కిమీ దూరం లో భూకంప కేద్రం ఉన్నట్లు గుర్తించారు.

ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. గురువారం వేకువ జామున 4 గంటల ప్రాంతం లో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది