ఒక్కసారిగా ఆ హీరోకు పెరిగిన డిమాండ్ : ప్రస్తుతం రోజుకు రూ.6కోట్లు

Wednesday, July 25th, 2018, 04:25:19 PM IST

ఏ చిత్రసీమలో అయినా నటీనటుల జయాపజయాల మీదనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ విడుదలయి సంచలన విజయం అందుకున్న సంజయ్ దత్ బయోపిక్ చిత్రం సంజు. ఈ చిత్రంలో అచ్చం సంజయ్ లానే నటించాడని రణబీర్ కు ప్రశంశల వర్షం కురుస్తోంది. అయన తప్ప మరొకరు ఈ పాత్రలో నటించలేరన్నవిధంగా మెప్పించారని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ చిత్రం మొత్తంగా దాదాపు రూ.500 కోట్లు పైచిలుకు కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ పండితులు చెపుతున్నారు.

ఈ చిత్రం విజయంతో రణబీర్ తన రెమ్యూనరేషన్ అమాంతం ఒక్కసారిగా పెంచేసినట్లు టాక్. ఇప్పటివరకు రణబీర్ చేతిలో 10కి పైగా టాప్ బ్రాండ్లను కలిగివున్నారని, వాటికిగాను అయన ఇప్పటివరకు రోజుకు రూ.3 కోట్లనుండి రూ.3.5 కోట్లవరకు తీసుకునేవారని, ఇక ప్రస్తుతం తన డిమాండ్ పెరగడంతో రోజుకు రూ.6 కోట్లు వసూలు చేస్తున్నారట. కాగా ప్రస్తుతం రణబీర్ బ్రహ్మాస్త్ర అనే చిత్రంలో అమితాబ్ తో కలిసి నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments