తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబులకు నోటీసులు.. వైద్యారోగ్య శాఖ హెచ్చరిక..!

Sunday, July 5th, 2020, 02:40:50 AM IST


తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో చేసేదేమి లేక ప్రైవేట్ ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం కొన్ని ల్యాబ్‌లకు అనుమతిచ్చింది.

అయితే ఈ ప్రైవేట్ ల్యాబ్‌లు తప్పులు సరిద్దుకోకుంటే మూసివేస్తామంటూ వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రైవేట్ ల్యాబ్‌లలో కరోనా టెస్టులు చేస్తున్నారని 13 ల్యాబ్‌లలో అసాధారణ రిపోర్టులు వస్తున్నాయని అన్నారు. అయితే తెలంగాణలో రికవరీ శాతం చాలా ఎక్కువగా ఉంటోందని ఎవరూ భయపడక్కర్లేదని చెప్పుకొచ్చారు.