నోటా ఎఫెక్ట్ .. మళ్ళీ రంగంలోకి దేవదాస్ లు ?

Friday, October 5th, 2018, 09:18:52 PM IST


భారీ అంచనాల మధ్య విడుదలైన దేవదాస్ సినిమా ఈ వారంలో పెద్దగా ఆశించిన స్థాయి వసూళ్లు అందుకోలేకపోయింది. దాదాపు 8 రోజుల్లో కేవలం 20 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది, దానికి కారణం భారీ అంచనాల మధ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా విడుదల అవ్వడం. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ సినిమా అంటే తెలుగులో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది .. ఈ క్రేజ్ లో దేవదాస్ లు సర్దేసుకోవలసిందే అని అందరు అనుకున్నారు .. కానీ పరిస్థితి మరోలా మారింది. నోటా పై ముందునుండి భారీ అంచనాలు పెంచేశారు .. సరే సినిమా సంచలనం రేపుతోందని అనుకున్నారు .. కానీ అసలు పరిస్థితి రివర్స్ అయ్యింది. భారీ అంచనాలతో విడుదలైన నోటా సినిమా అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అసలు ఈ సినిమాలో కథే లేకపోవడం .. హీరో డమ్మీగా ఉండడం వంటి చాలా అంశాలు సినిమాను నీరుగార్చాయి. దాంతో సినిమా లవర్స్ మొత్తం నోటా విషయంలో నిరాశకు లోనయ్యారు. దాంతో నోటా రెండో షో నుండే కలక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. నోటా ఎఫెక్ట్ తో మళ్ళీ తమ సినిమా పుంజుకుంటుందని భావించారు దేవదాస్ దర్శక నిర్మాతలు .. అందుకే నాగార్జున ఇటీవలే ఫ్యామిలీ తో కలిసి విదేశాల్లో హాలిడేస్ కి వెళ్లొచ్చారు .. వచ్చి రాగానే .. నోటా ఎఫెక్ట్ తో వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో మళ్ళీ దేవదాస్ ప్రమోషన్ మొదలు పెట్టారు. మొత్తానికి నోటా ఎఫెక్ట్ తో దేవదాస్ లో కొత్త ఉత్సాహం వచ్చేసింది. వచ్చే వారం వరకు థియేటర్స్ లో దేవదాస్ లు సందడి చేయొచ్చు.