దేవదాస్ … పక్కా కాపీ క్యాట్ ?

Monday, October 1st, 2018, 11:39:03 AM IST

నాగ్ – నాని హీరోగా నటించిన దేవదాస్ సినిమా ఇటీవలే విడుదలైన మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. నాగ్ – నాని ల ఇమేజ్ తో బాగానే నెట్టుకొస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుండి ఇది కాపీ సినిమా అంటూ నానా రచ్చ జరుగుతూనే ఉంది. ఈ కథకు ఎలాంటి కాపీ మరకలు అంటకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్ .. కానీ నిజం దాగుతుందా చెప్పండి .. ఈ సినిమా చుసిన వాళ్లంతా అబ్బో గొప్ప సినిమా అని ఎవరు చెప్పడం లేదు .. పైగా ఇద్దరు ముగ్గురు రచయితలూ కూర్చొని సెట్ చేసిన కథ .. మరి ఇంత పేలవంగా ఎందుకు ఉంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా హాలీవుడ్ లో వచ్చిన అనాలసిస్ థిస్ అనే సినిమాను స్ఫూర్తి గా తీసుకుని చేసారని, అన్నారు. ఈ విషయం పై దర్శకుడు క్లారిటీ ఇస్తూ ఇది ఏ సినిమాకు కాపీ కాదంటూ చెప్పేసాడు .. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ సినిమాను మరో సినిమాను కాపీ కొట్టి మక్కికి మక్కి దింపేశారని అంటున్నారు . ఇంతకీ ఆ సినిమా ఎదో తెలుసా .. మలయాళంలో హిట్ అయినా ”భార్గవ చరితం మమూనం ఖండమ్” సినిమా. ఆ సినిమాలో మమ్ముట్టి డాన్ గా నటించాడు. శ్రీనివాసన్ డాక్టర్ గా కనిపిస్తాడు .. డాన్ ను మార్చాలన్న ప్రయత్నాలు చేస్తుంటాడు శ్రీనివాసన్. ఇప్పుడు దేవదాస్ చూసినవాళ్లంతా నిజంగా ఇది కాపీ సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై సదరు దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.