దేవా – దాస్ లకు బాగానే వర్కవుట్ అయిందిగా ?

Sunday, September 30th, 2018, 10:35:09 AM IST

కింగ్ నాగ్- నాచురల్ స్టార్ నాని కేంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ మల్టి స్టారర్ దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా ఈ గురువారం విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.మొదటి రేజే తెలుగు రాష్ట్రాల్లో 4. 67 కోట్ల వసూళ్లు అందుకోగా ప్రపంచ వ్యాప్తంగా 6. 57 కోట్ల వసూళ్లు అందుకుని మంచి బోణి కొట్టింది. ఇక షేర్ లో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే 2. 50 కోట్ల షేర్ అందుకోవడం విశేషం. నాగ్ ఇమేజ్, నాని నటన .. పూర్తీ స్థాయి ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వెకెండ్ లో 20 కోట్ల వసూళ్లను అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు ఓవర్ సీస్ లోకూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ దక్కడంతో దేవదాస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. మరి ఈ సినిమా కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ..రెండు రోజుల కలక్షన్స్ గ్రాస్ లలో ..

నైజాం – 2. 50 కోట్లు,
ఉత్తరాంధ్రా – 0. 87 కోట్లు,
సీడెడ్ – 1. 01 కోట్లు,
గుంటూరు – 0. 68 కోట్లు,
ఈస్ట్ -0. 53 కోట్లు,
వెస్ట్ – 0. 38 కోట్లు,
కృష్ణా – 0. 48 కోట్లు,
నెల్లూరు – 0. 26 కోట్లు,
ఆంధ్రా – తెలంగాణ కలిపి – 6. 7 కోట్లు.
ఓవర్ సీస్ – 1. 72 కోట్లు.