పెళ్లి గురించి అడిగితె దేవి శ్రీ ఏమన్నాడో తెలుసా ?!

Sunday, January 28th, 2018, 09:47:06 PM IST


టాలీవుడ్ సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే అందరికి ఇష్టమే. అయన సంగీతం అందించిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్స్. ప్రస్తుతం రంగస్థలం, భారత్ అనే నేను సినిమాలకు సంగీతం అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఓ సందర్బంగా దేవి ని మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాడో తెలుసా .. మీకు నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదా ? అంటూ చెప్పేసరికి అక్కడున్న అందరు గొల్లుమని నవ్వేసారూ ? అంటే పెళ్లి పై దేవికి మంచి ఉద్దేశం లేదని అర్థం అవుతుంది. ఇప్పటికే ముదురు బ్రహ్మచారిగా ఉన్న దేవి శ్రీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అని అనుకుంటున్నారు అందరు. దేవి శ్రీ మహేష్ – వంశీ పైడిపల్లి సినిమాకు సంగీతం అందిస్తున్నానని చెప్పాడు.