ఆ అధికారం మీకు ఎవరు ఇచ్చారు జగన్? – దేవినేని ఉమా

Friday, June 11th, 2021, 12:58:51 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై మరోమారు నిప్పులు చెరిగారు తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజి మంత్రి దేవినేని ఉమా. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 10 వారాల్లో 12 వేల కోట్ల అప్పు అంటూ చెప్పుకొచ్చారు. అయితే జూలై నాటికి 20 వేల కోట్ల రూపాయల పరిమితి పూర్తి అంటూ వ్యాఖ్యానించారు. తాకట్టు తోనే ఆగస్ట్ నుండి అప్పులు అంటూ విమర్శలు చేశారు.5 వేల కోట్ల రూపాయల విలువైన ఆర్ అండ్ బీ ఆస్తులు తనఖా పెట్టీ అప్పు తెచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారు జగన్ అంటూ సూటిగా ప్రశ్నించారు ఉమా. అయితే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని పలు అంశాల పై, ప్రజా సమస్యల పై గళమెత్తే దేవినేని ఉమా మరొకసారి అప్పుల వ్యవహారం పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సూటిగా ప్రశ్నించారు. అయితే దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.