తప్పుడు జీవోలతో లక్షలాది పాడిరైతుల జీవితాలను దెబ్బతీస్తున్నారు – దేవినేని ఉమా

Wednesday, April 28th, 2021, 04:40:04 PM IST

Jagan_Uma

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. అయితే సంగం డెయిరీ ను స్వాధీనం చేసుకోవాలన్న కుట్రలో భాగం గానే తెలుగు దేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ను తప్పుడు కేసులతో జైలుకి పంపారు అంటూ ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తప్పుడు జీవో లతో లక్షలాది మంది పాడి రైతుల జీవితాలను దెబ్బ తీస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే సమర్థవంతంగా పని చేస్తున్న డెయిరీ లను దెబ్బ తీస్తూ ఇతర రాష్ట్ర డెయిరీ లకు మేలు చేకూర్చే చర్యల వెనుక అవినీతి మతలబు ఏంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే తెలుగు దేశం పార్టీ నేత దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ అనుసరిస్తున్న విధానాలు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.