చంద్రబాబు మాటలు వినబడుతున్నాయా జగన్ – దేవినేని ఉమా

Wednesday, May 12th, 2021, 04:14:21 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజి మంత్రి దేవినేని ఉమా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్ అందక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది చనిపోయారు అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్ధత మరియు నిర్లక్ష్యానికి సామాన్య ప్రజల ప్రాణాలు బలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వాక్సిన్ల కొనుగోలుకి పెట్టిన ఆర్డర్లు, చేసిన చెల్లింపుల పై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు. మరొక పక్క కరోనా పై చర్చించడానికి అఖిల పక్షం ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు మాటలు వినబడుతున్నాయా జగన్ అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన విధానం పై దేవినేని ఉమా తరచూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోవడం వంటి ఘటనలు ఏపీ లో జరుగుతూ ఉండటం తో అధికార పార్టీ వైసీపీ పై టీడీపీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు వాక్సిన్ మరియు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కి వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు.