నాపై మోపిన తప్పుడు కేసుల పైనా వచ్చి మాట్లాడతా – దేవినేని ఉమా

Wednesday, April 21st, 2021, 08:00:22 PM IST

Jagan_Uma

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజి మంత్రి దేవినేని ఉమా పై సీఐడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పట్ల ఆయన స్పందించారు. మార్చి 15 న మొదటి దశ కోవిడ్ వాక్సిన్ తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు దేనినేని ఉమా. ఏప్రియల్ 15 న రెండవ దశ వాక్సిన్ తీసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే డాక్టర్ల సలహా మేరకు కోవిడ్ రక్షణ చర్యలు పాటిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. అయితే పోలవరం పై పెంచిన అంచనాల పైన, నాపై మోపిన తప్పుడు కేసుల పైనా వచ్చి మాట్లాడుతా జగన్ అంటూ దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. అయితే దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు.

దేవినేని ఉమా వ్యాఖ్యల పట్ల నెటిజన్లు ఘాటు విమర్శలు చేస్తున్నారు. సిఐడి వాళ్లకు ఇదే విషయం చెప్పవచ్చు కదా, పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అంటూ టీవీ లో చూపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దేవినేని ఉమా గతంలో సైతం వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ వరుస ప్రశ్నలు సంధించారు. అదే తరహాలో ప్రశ్నల తో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన విధానం పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయం లో రివర్స్ టెండరింగ్ పట్ల టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేయగా, వైసీపీ నేతలు డబ్బులు ఆదా అంటూ చెప్పుకొచ్చారు. లెక్కలు సైతం చూపించారు. అయితే తాజాగా అంచనాలు పెంచారు అంటూ దేవినేని ఉమా వెల్లడించారు. అయితే ఉమా చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.