వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను అమ్మే హక్కు ఎవరిచ్చారు జగన్? – దేవినేని ఉమా

Wednesday, April 7th, 2021, 04:45:54 PM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజి మంత్రి దేవినేని ఉమా మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఫర్ సేల్ లో భాగం గా 4 స్థలాలు 1,465 కోట్ల రూపాయలకు బేరం అంటూ దేవినేని ఉమా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తెలుగు దేశం పార్టీ హయాంలో ఒప్పందం చేసుకున్న లులూ గ్రూప్ ను వెళ్లగొట్టారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే జీతాలు, పెన్షన్లు చెల్లించలేక ఆంధ్ర ప్రదేశ్ ను అప్పుల కుప్ప గా మార్చిన మీకు, వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను అమ్మే హక్కు ఎవరిచ్చారు జగన్ అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు.

అయితే మరొక పోస్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం ను నిలదీస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అమూల్ కి పాలు పోయకపోతే పథకాలు ఆపేస్తాం అని బెదిరింపులు అంటూ చెప్పుకొచ్చారు. పెన్షన్ ఇతర లబ్ది ఏమి ఉండదు, పాలు తగ్గిన గ్రామాలను గుర్తించి చర్యలు తీసుకుంటాం అంటూ ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్ర డైరీ కి పాలు పొయ్యకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కంటే పొరుగు రాష్ట్ర డైరీ పై ప్రేమ వెనకున్న అవినీతి మతలబు ఎంటి జగన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.