ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజి మంత్రి దేవినేని ఉమా ప్రభుత్వ తీరును ఎండగడుతూ మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మార్చి నెల జీతాలు, పెన్షన్ల కోసం లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురు చూపులు అంటూ దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ కూడా వాటికి సంబందించిన బిల్లులను ఆర్బీఐ కి చేరలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అధికారం లోకి వచ్చి 22 నెలలు అయినా ఒక్క పూర్తి బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టని సర్కార్ అంటూ విమర్శించారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా జగన్ అంటూ సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రంలోని పలు సమస్యల పట్ల టీడీపీ నేతలు వరుస ప్రశ్నలతో రాష్ట్ర ప్రభుత్వం ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో అధికార పార్టీ వైసీపీ ను మరొకసారి టార్గెట్ చేస్తూ టీడీపీ వరుస ప్రశ్నలు సందిస్తోంది. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
మార్చినెల జీతాలు,పెన్షన్ల కోసం లక్షలాదిమంది ఉద్యోగులు,పెన్షనర్ల ఎదురుచూపులు. ఇప్పటివరకు ఆర్బీఐకి చేరని బిల్లులు. అయోమయంలో ఉద్యోగులు,పెన్షనర్లు. అధికారంలోకొచ్చి 22నెలలైనా ఒక్క పూర్తిబడ్జెట్ ప్రవేశపెట్టని సర్కార్. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యంఉందా?@ysjagan pic.twitter.com/qfeOHgibWX
— Devineni Uma (@DevineniUma) April 4, 2021