బ్రేకింగ్: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దేవినేని

Sunday, October 20th, 2019, 06:21:13 PM IST

జగన్ పై ప్రజల్లో ఎంత విశ్వాసం వున్నా, టీడీపీ నేతలు మాత్రం ఒక్కొక్కరుగా జగన్ పై, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే వున్నారు. తాజాగా దేవినేని ఉమా మరొకసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పెండింగ్ బిల్లులను ఎవరికీ ఇచ్చారో చెప్పే దైర్యం వుందా అని ప్రశ్నించారు. పోలవరం, వెలిగొండ ప్రోజెక్టుల గురించి ప్రస్తావించారు. ఒకే గుత్తందారుకి ఈ రెదను ప్రాజెక్టులు దక్కాయని, వెలిగొండ ప్రాజెక్ట్ విషయం లో రియాలిటీ షో జరుగుతుందని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటో టన్నెల్ పనులు చేసేవారికే రెండో టన్నెల్ పనులు అప్పగించారని, జగన్ ఇంట్లో కూర్చొని డ్రామాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.

ప్రోజెక్టుల విషయాల పై నే ఎక్కువగా ప్రస్తావించిన దేవినేని ఉమా, పోలవరం ప్రాజెక్ట్ పనులన్నీ హై కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. ప్రోజెక్టుల టెండర్ల విషయం లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. బోటు మునిగి ఇన్ని రోజులు అయినా ఇంత వరకు వెలికి తీయలేదని అన్నారు. బోటు మునిగిన ప్రాంతం వద్ద 144 సెక్షన్ పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. రైతు భరోసా పథకం పై కూడా పలు ఆరోపణలు చేసారు దేవినేని ఉమా.