బిగ్ బ్రేకింగ్ : జగన్ పై మరోసారి ఉమా కాక రేపే కామెంట్స్.!

Wednesday, November 20th, 2019, 11:12:13 AM IST

ఏపీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్ తీసుకుంటున్నవంటి నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాం.జగన్ చేపట్టిన ఏ చిన్న పనిని కూడా వదలకుండా టీడీపీ నేతలు వాటిలోని తప్పులను లొసుగులను ఎత్తి చూపుతూ జగన్ వైఖరిని ఎండగడుతున్నారు.ఇదిలా ఉండగా మొన్నీమధ్యనే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ మరియు వైసీపీ మంత్రి కొడాలి నానీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది.

మళ్ళీ ఈలోపే దేవినేని ఉమ మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.2020లో పూర్తి కావాల్సిన పోలవరాన్ని ఇప్పుడు ఈ తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటున్న దద్దమ్మ ప్రభుత్వం 2022 అంటుంది అని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.అంతే కాకుండా పోలవరం పనులు ఎందుకు నత్త నడకన సాగిస్తున్నారని ప్రశ్నించారు.దీని కోసమా ఒక్కసారి అధికారం ఒక్కసారి అధికారం అని అన్నారు రాష్ట్రాన్ని ముంచడానికా మీకు అధికారం కావాలి అంటూ మరోసారి జగన్ పై దేవినేని సంచలన కామెంట్స్ చేసారు.