జగన్ పిచ్చి ఆసుపత్రికి పోతున్నాడు.. దేవినేని ఉమ సీరియస్ కామెంట్స్..!

Tuesday, January 14th, 2020, 11:30:34 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు పెద్ద 28 రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని అమరావతిలో నెలకొన్న పరిస్థితులపై నేడు మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ సీఎం జగన్‌పై సీరియస్ కామెంట్స్ చేశారు.

అయితే ఈ నెల 23న జగన్‌ తట్టబుట్ట సర్దుకొని విశాఖ పిచ్చాసుపత్రికి వెళ్తున్నాడని అన్నారు. మహిళలపై పోలీసులు దాడి జరపడంపై హైకోర్ట్ సీరియస్ కావడంతో పోలీసుల హవా తగ్గిందని, ప్రభుత్వానికి కాస్త బుద్ధి వచ్చిందని అన్నారు. రాజధాని అమరావతిలో టీడీపీ ప్రభుత్వం 10 వేల కోట్లు ఖర్చు చేస్తే , ప్రైవేటు వ్యక్తులు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. విశాఖలో ప్రస్తుతం సచివాలయం పెట్టాలని అనుకుంటున్న భవనం కూడా చంద్రబాబు కట్టించిందే అని అన్నారు.