జగన్ పాలనపై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు..!

Monday, August 19th, 2019, 10:17:48 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నేడు మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనపై సంచలన ఆరోపణలు చేసారు. పాలన అంటే సూట్ బూట్ వేసుకుని అమెరికాలో పర్యటించడం కాదని ఎద్దేవా చేసారు. గతంలో గోదావరి వరదలొస్తే సీఎం జగన్ జెరూసలెం వెళ్ళారని, ఇప్పుడు కృష్ణాకి వరదలొస్తే అమెరికా వెళ్ళడం ఏంటి అని ప్రశ్నించారు. అయితే గోదావరి వరదలపై ఒక్క సమీక్షా సమావేశం చేయలేదని లోకేష్‌ పర్యటించిన తర్వాతే జగన్‌ హెలిక్యాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేశారని అన్నారు.

అయితే నదుల్లో నీటి లభ్యత సమృద్ధిగా ఉన్నా రాయలసీమకు నీళ్ళు ఇవ్వడంలేదని కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందని పోతిరెడ్డిపాడు ద్వారా సోమశిల, కండలేరుకు నీళ్లివ్వొచ్చని అన్నారు. కృష్ణా డెల్టా రైతులు మోటార్లతో నీళ్లు తెచ్చుకుంటున్నారని ఇది వైసీపీ ప్రభుత్వానికి కనబడడంలేదా అని ప్రశ్నించారు. సినిమాలు చూసినంత మాత్రాన నటులు కాలేరని వరదలు పక్కన పెట్టి చంద్రబాబు నివాసాన్ని ముంచాలని చూసారని, వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు తాగేందుకు ప్రజలను మినరల్‌ వాటర్‌ అడగడం నిజంగా సిగ్గు చేటు అని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే బూతులు తిడుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షానికి ఉందని గుర్తు చేసారు. అడ్డ మీద ఏ కూలీని అడిగినా వైసీపీ అరాచక పాలన గురుంచే మాట్లాడుతున్నారని అన్నారు