రంగస్థలం అభిమానులని మోసం చేసావ్… దేవీ

Saturday, March 31st, 2018, 10:20:41 PM IST

రంగస్థలం సినిమా థియేటర్లలో అనూహ్యమైన స్పందనతో సందడి చేస్తోంది. సెకండాఫ్‌లో కాస్త సాగాదీసినటువంటి సన్నివేశాలు ఉన్నప్పటికీ.. చెర్రీ నటన, విలేజ్‌ సెట్టింగ్‌తో సుక్కూ చేసిన మాయ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. దీనికి దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు కూర్చిన పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. అయితే సినిమాలోని ఓ పాట గురించి ఇప్పుడు చాలా పెద్ద చర్చ మొదలైంది. ఈ చిత్రంలో ‘ఆ గట్టునుంటావా నాగన్న?’ పాట ఆడియో ఆల్బమ్‌లో జానపద గేయంగా పెద్ద హిట్‌గా నిలిచింది. పొలిటికల్‌ నేపథ్యంలో సాగే ఆ పాట సినిమాలో హైలెట్‌ కావటమని అంతా అనుకున్నారు. అయితే థియేటర్లకు వెళ్లిన వారికి ఆ సాంగ్‌తో దేవీ ఎన్నటికీ షాకిచ్చాడు. ఆడియోలో ఈ పాటను దేవి పాడిన వర్షన్‌ ఉంది. నిజానికి ఒరిజినల్‌ వర్షన్‌ పాడింది జానపద గేయకారుడు శివ నాగులు. ఆడియోలో ఆ పాట అంత హిట్‌ కావటానికి కూడా ఆయన గాత్రమే అసలు కారణం. కానీ, సినిమాలో నాగులు వాయిస్‌ బదులు దేవీ గొంతు వినిపించటంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సోషల్‌మీడియాలో దేవీని నిలదీస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఆడియో ఆల్బాల్ లో ఉన్నంత కిక్కు సినిమాలో దేవీ గొంతుతో వింటే కిక్కివ్వడం లేదు అన్నారు.