తమిళనాడులో హై అలర్ట్.. కరుణానిధికి ఏమైంది..!!

Wednesday, September 27th, 2017, 11:55:51 PM IST


డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వ్యాపించడంతో తమిళనాడులో పోలీస్ లు రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ని విధించారు. రాష్ట్ర డిజిపి రాజేంద్రన్ పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేశారు. సెలవుల్లో ఉన్న పోలీస్ లు కూడా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ లు ఎక్కడికక్కడ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ లు చేస్తున్న హడావిడి, కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఆందోళన ప్రజల్లో నెలకొని ఉంది.

కాగా కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వదంతులని ఆయన కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి ఖండించారు. కరుణానిధి ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. మరోవైపు శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఆయన్ని చూడడానికి శశికళ జైలు నుంచి పెరోల్ పై రానున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మద్దత్తు దారులు అలలర్లు సృష్టించే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినట్లు మరి కొంత మంది చర్చించుకుంటున్నారు.

Comments