ధ‌డ‌క్ తొలి వీకెండ్ 30కోట్లు

Sunday, July 22nd, 2018, 01:15:14 PM IST

జ‌నాల క‌ళ్ల‌న్నీ జాన్వీ డెబ్యూ సినిమాపైనే. అస‌లింత‌కీ ఈ శుక్ర‌వారం రిలీజైన `ధ‌డ‌క్` ఇప్ప‌టికి ఎంత వ‌సూలు చేసింది? ప‌రిశీలిస్తే షాకిచ్చే నిజాలే తెలిశాయి. డెబ్యూ నాయిక‌గా జాన్వీ పెద్ద స‌క్సెస్ అంటూ క్రిటిక్స్ పొగిడేశారు. అందుకు త‌గ్గ‌ట్టే ఓపెనింగులు ఫ‌ర్వాలేద‌నిపిస్తోంది. ధ‌డ‌క్ రెండ్రోజుల్లో 20 కోట్ల నెట్‌ వ‌సూలు చేసి, తొలి వీకెండ్ మూడు రోజుల‌కు 30కోట్ల నెట్‌ ఖాతాలో వేసుకోబోతోంద‌ని ట్రేడ్ చెబుతోంది.

శుక్ర‌వారం -9 కోట్లు, శ‌నివారం – 11కోట్ల నెట్‌ వ‌సూలు చేసిన ధ‌డ‌క్ మూడో రోజు 10కోట్ల నెట్‌కు త‌గ్గ‌కుండా వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మెట్రో న‌గ‌రాల్లో జాన్వీ మానియాతో వ‌సూళ్ల హ‌వా సాగుతోంది. ఇక ఏపీ, తెలంగాణ మెట్రో న‌గ‌రాలైన హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌లోనూ జాన్వీ డెబ్యూపై ఆస‌క్తిగా జ‌నం వేచి చూడ‌డం వ‌ల్ల మ‌ల్టీప్టెక్సుల్లో వ‌సూళ్లు బాగానే ఉన్నాయిట‌. ఎక్క‌డో పంజాబ్‌, దిల్లీ వంటి చోట్ల జ‌నం ప‌లుచ‌గా ఉన్నారు థియేట‌ర్ల‌లో. ఇక‌పోతే కేవ‌లం మూడు రోజుల్లో 30 కోట్లు అంటే డెబ్యూ నాయిక‌కు, రెండో సినిమా హీరో ఇషాన్‌కి ఆషామాషీ కానేకాదు. దాదాపు 70 కోట్ల బ‌డ్జెట్‌తో ధ‌ర్మ‌ప్రొడ‌క్ష‌న్స్‌లో క‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే సైరాట్ కేవ‌లం 4కోట్ల‌తో తెర‌కెక్కి 100కోట్లు వ‌సూలు చేసింది. ఆ రిజ‌ల్ట్‌తో పోలిస్తే ధ‌డ‌క్ నాలుగురెట్లు వ‌సూలు చేయాల‌ని అంటున్నారు. మినిమం 200కోట్ల నెట్ వ‌సూలు చేస్తేనే పెద్ద స‌క్సెస్ కింద లెక్క‌. మ‌రి జాన్వీ ఆ రేంజు హిట్టిస్తుందా?

  •  
  •  
  •  
  •  

Comments