అమెరికాలో ధ‌డ‌క్ కేక‌లే

Monday, July 23rd, 2018, 12:22:59 PM IST

జాన్వీ న‌టించిన `ధ‌డ‌క్` కేవ‌లం రెండు రోజుల్లో 20కోట్ల నెట్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది. ఇది ఇండియా బాక్సాఫీస్ వ‌ద్ద మాత్ర‌మే. అయితే ఓవ‌ర్సీస్ రిపోర్ట్ ఏంటి? అంటే అక్క‌డా జాన్వీ హ‌వా సాగుతుంద‌నే త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌ చెబుతున్నారు. ఈ శుక్ర‌వారం రిలీజైన ధ‌డ‌క్ శుక్ర‌, శ‌ని, ఆదివారాల్లో ఏకంగా 30 కోట్ల నెట్‌తో స్వ‌దేశీ వ‌సూళ్ల ప‌రంగా అద‌ర‌గొట్టేసిందని రిపోర్ట్ అందింది.

ఇక అమెరికాలోనూ ఏకంగా 6కోట్ల (858కె డాల‌ర్లు) వ‌సూళ్లు సాధించ‌డం చూస్తుంటే ఒక డెబ్యూ నాయిక‌గా జాన్వీ కేక‌లే అని పొగిడేయాలి. ఇక ఈ చిత్రంతోనే షాహిద్ సోద‌రుడు ఇషాన్ సైతం బాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయ్యాడు. ఇంత‌కుముందు హాలీవుడ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నా,ఈ చిత్రంలో అద్భుతంగా న‌టించాడ‌న్న పేరొచ్చింది. ఇక‌పోతే మామ్ శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిని తెర‌కు ప‌రిచ‌యం చేసిన ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్ అధినేత క‌ర‌ణ్ జోహార్‌కి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. మొత్తానికి జాన్వీ దూకుడు ఇంటా బ‌య‌టా బాగానే సాగుతోంది. శ్రీ‌దేవికి ఉన్న అంత‌ర్జాతీయ గుర్తింపు వల్ల ఇటు భార‌త‌దేశంలో, అటు అమెరికా, గ‌ల్ఫ్ దేశాల్లో చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఆస‌క్తిక‌రంగా పాకిస్తాన్‌లోనూ జాన్వీ సినిమాకి చ‌క్క‌ని వ‌సూళ్లు ద‌క్కాయి. ధ‌డ‌క్ బాక్సాఫీస్ వ‌ద్ద ఫుల్‌ర‌న్‌లో ఈజీగా 100కోట్ల నెట్ వ‌సూలు చేస్తుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే భారీ బ‌డ్జెట్ వెచ్చించిన ఈ సినిమా అంత‌కుమించి వ‌సూలు చేస్తేనే బంప‌ర్ హిట్ కింద లెక్క‌.

  •  
  •  
  •  
  •  

Comments