ట్రైల‌ర్‌లో జాన్వీ గ్లింప్స్ కెవ్వు కేక‌

Monday, June 11th, 2018, 01:16:18 PM IST

`అతిలోక సుంద‌రి 2` ని తెర‌పై వీక్షించేందుకు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ఈ జూలైలోనే ధ‌డ‌క్ రిలీజ్‌. అటు హిందీ వాళ్లు, ఇటు తెలుగు, త‌మిళులు అంద‌రికీ న‌చ్చే శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ న‌ట‌న ఎలా ఉంటుందా? అని ఎదురు చూసిన వారికి ధ‌డ‌క్ ట్రైల‌ర్ ఓ విజువ‌ల్ ట్రీట్‌ని తెచ్చింది. ఇంత‌కీ ఈ ట్రైల‌ర్‌లో జాన్వీ ఎలా ఉంది? శ్రీ‌దేవి లెగ‌సీని ముందుకు తీసుకెళ్లేలానే క‌నిపిస్తోందా? అంటే మాత్రం రివ్యూ చ‌ద‌వాల్సిందే.

ధ‌డ‌క్ ట్రైల‌ర్ ఆద్యంతం జాన్వీ గ్లింప్స్ మైమ‌రిపిస్తున్నాయ్‌. అంతేకాదు .. షాహిద్ సోద‌రుడు ఇషాన్ ఖ‌త్త‌ర్ ఎంతో ఎమోష‌న‌ల్ పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. అనాధ‌లైన ప్రేమ‌జంట వెంట‌ప‌డే కుల దుర‌హంకారం ఏంటి? పోలీసులు, నాయకులు దౌర్జ‌న్యం ఏంటి? అన్న‌ది తెర‌పై చూడాల్సిందేనన్న ఉత్కంఠ‌ను ధ‌డ‌క్ ట్రైల‌ర్ రెయిజ్ చేసింది. ట్రైల‌ర్ ఆద్యంతం జాన్వీ అంద‌చందాలు క‌న్నుల‌పండువ చేశాయి. ఇక సినిమా ఆద్యంతం జాన్వీ- ఇషాన్ ల‌వ్ స్టోరితో పాటు ఎమోష‌న్ ర‌న్ అవుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే సైరాఠ్ కంటే భిన్నంగా ఈ చిత్రంలో నాయ‌కానాయిక‌లు కాస్తంత రిచ్‌లుక్‌తో క‌నిపిస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ నేతృత్వంలోని ఈ చిత్రం జులైలో రిలీజ్ కానుంది.