వేశ్య పాత్రలో … కబాలి భామ ?

Thursday, January 19th, 2017, 03:48:03 PM IST

dhansika
సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా వచ్చిన ”కబాలి” సినిమాలో రజని కాంత్ కూతురిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ ధన్సిక ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధం అయింది. రొమాంటిక్ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు వేశ్య అవతారం ఎత్తనుందట !! జనరల్ గా హీరోయిన్స్ కి ఇలాంటి వేశ్య పాత్రలంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, దానికి కారణం ఆ పాత్రలో నటనకు స్కోప్ బాగా ఉండడమే కాకుండా అన్ని ఎమోషన్స్ తో పాటు కాస్త సింపతీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పాత్రలు జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటి ప్రయోగం చేయబోతుంది ధన్సిక. అదికూడా సినిమాకోసం కాదట? ఓ షార్ట్ ఫిలిం కోసమని తెలిసింది. ‘సీనం’ అనే పేరుతొ రూపొందే ఈ చిత్రంలో ఓ వేశ్యకు .. డాక్యుమెంటరీ మేకర్ కు మధ్య జరిగే కథగా ఉంటుందట. కోల్కత్త బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాతో మరి ధన్సిక ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి !!