ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ అదిరిందబ్బా ?

Thursday, November 2nd, 2017, 10:53:59 AM IST

తమిళ హీరో ధనుష్ జోరు మాములుగా లేదు .. ఇప్పటికే కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ధనుష్ అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు, తెలుగులో కూడా ధనుష్ అంటే మంచి క్రేజ్ ఉంది. తాజాగా ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కెన్ ష్కాట్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ది ఎక్స్టెర్డినరీ జర్నీ అఫ్ ది ఫకీర్ పేరుతొ రూపొందే సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో ధనుష్ పాత్ర కీలకంగా ఉంటుందట. ధనుష్ టాలెంట్ నచ్చి ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు దర్శకుడు. హాలీవుడ్ నటీనటులతో పాటు ధనుష్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ధనుష్ హాలీవుడ్ లో ఇమేజ్ తెచ్చుకోవడం ఖాయం అని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

  •  
  •  
  •  
  •  

Comments