ధనుష్… ఈ యుద్ధం ఎవరితో ?

Sunday, July 29th, 2018, 08:05:15 PM IST

సౌత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ధనుష్ అటు బాలీవుడ్ లోకూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. బిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న ధనుష్ కథల విషయంలో చాలా క్లారిటీతో ఉంటాడు. కథనే నమ్ముకుని సినిమాలు చేసే ధనుష్ తాజాగా వడ చెన్నై సినిమాతో ముందుకు వస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తుంది. యుద్ధం చేయక తప్పదు .. మన ఊరు, గుడిసెలైన… చెత్త కుప్పలైన సరే .. యుద్ధం ఆగదు. మనలను అణగదొక్కుతూనే ఉంటారంటూ .. యుద్ధం చేయాల్సిందే అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్స్ షాక్ ఇస్తున్నాయి . ఇంతకీ ధనుష్ యుద్ధం ఎవరిపై అన్న ఆసక్తితో షాకిస్తున్న ఈ ట్రైలర్ అనూహ్య మైన వ్యూస్ తో ఆకట్టుకుంటుంది. గతంలో వెట్రి మారన్ – ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన ఆడుకలం చిత్రం సంచలన విజయం రేపిన విషయం తెలిసిందే. మరి ఈ వాడా చెన్నై ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments