టీచర్ వివాదం.. ధావన్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

Thursday, September 28th, 2017, 05:00:15 PM IST


ఒకప్పుడు చిన్న స్కూల్ విద్యార్థులు తప్పు చేస్తే దండించే హక్కు ఉపాధ్యాయులకు ఉండేది. కానీ మారుతున్న కాలంలో విద్యార్థులని దండించిన ఉపాధ్యాయులపై ఖఠినమైన శిక్షలు అమలవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో స్కూల్ విద్యార్థిని ఓ ఉపాధ్యాయురాలు డస్టర్ తో కొట్టిన ఘటన వివాదంగా మారింది. శ్రేయాన్ష్ (14) అనే విద్యార్థి క్లాస్ జరుగుతున్న సమయంలో తోటి విద్యార్థులకు ఇబ్బంది కలిగించాడు. ఈ విషయాన్ని గమనించిన టీచర్ శ్రేయాన్ష్ ని చెక్క డస్టర్ తో చేతిపై కొట్టింది. తన కుడి చేతికి గాయమై నుందని అక్కడ కొట్టవద్దని విద్యార్థి టీచర్ ని కోరినా ఆమె వినలేదు.

దీనితో శ్రేయాన్ష్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనితో ప్రిన్సిపాల్ ఆమెని విధులనుంచి తప్పించారు. ఈ వివాదంపై ధావన్ సోషల్ మీడియాలో స్పదించారు. ”నేను స్కూల్ టీచర్ ని కాదు.. కానీ విద్యార్థులు తప్పు చేసినప్పుడు దండించడంలో ఎలాంటి తప్పు లేదు” అని సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం పడ్డారు. కాగా విద్యార్థులని ఉపాధ్యాయులు దండించకూడదని ఇటీవల చట్టాలు కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ కూడా జరుగుతోంది.

Comments