షమి అలాంటి వాడు కాదు : ధోని

Tuesday, March 13th, 2018, 03:43:32 PM IST

గత కొన్ని రోజులుగా భారత ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమికి షమీపై అతని భార్య తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. షమీకి ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తనను ఎంతో వేధించేవాడని తెలిపింది. సౌత్ ఆఫ్రికా సిరీస్ అనంతరం షమీ దుబాయ్ వెళ్లినట్లు ఆమె ఆరోపణలు చేసింది. ఈ విషయంపై కోల్ కత్తా పోలీసులు విచారణ చేపట్టారు. అంతే కాకుండా బిసిసిఐ ని కూడా వారి నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వివాదంపై భారత క్రికెటర్లు ఎవరు అంతగా స్పందించలేదు. కానీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని తన అభిప్రాయాన్ని తెలిపాడు. షమీ వ్యక్తిగత విషయంలో స్పందించకూడదు. కానీ నాకు తెలిసినంత వరకు షమీ అలాంటి వాడు కాదు. దేశాన్నీ భార్యను మోసం చేయడు అని తన అభిప్రాయాన్ని తెలిపాడు. షమీ కెరీర్ లో ధోని కీలకపాత్ర పోషించాడు.

  •  
  •  
  •  
  •  

Comments