నా భార్య కంటే.. ధోనినే ఎక్కువ ఇష్టం: పాకిస్థాన్ ఫ్యాన్

Friday, March 9th, 2018, 06:27:38 PM IST


భారత జట్టు మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని అంటే ఇష్టమా అని అడగకూడదు ఎంత ఇష్టమో అని అడగాలి. ఏ భారతీయుడిని అడిగినా ఇదేమాట చెబుతాడు. ధోని టీమ్ లో ఉంటే చాలు మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోని నాయకత్వ లక్షణాలు ఆట తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. విదేశీ అభిమానులు కూడా ధోనీ ని చాలా ఇష్టపడతారు. అయితే ఓ పాకిస్థాన్ వ్యక్తి కూడా ధోని అంటే పడిచస్తాడు. అతనికి ధోని ఎంత ఇష్టమంటే.. నా భార్య కంటే నాకు ధోనీపైనే ఎక్కువ ప్రేమ అని చెబుతున్నాడు.

అతని పేరు మహమ్మద్‌ బషీర్‌. పాకిస్థాన్ క్రికెట్ అభిమాని. ఎక్కడ మ్యాచ్ జరిగినా వస్తుంటాడు. అయితే అతను ధోనిని అంతగా ఎందుకు ఇష్టపడతాడు అనే విషయంలోకి వెళితే.. 2011 లో భారత్ – పాకిస్థాన్ మధ్య ప్రపంచ కప్ సెమి ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ చూడటానికి బషీర్ పాకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చాడు. మొహాలీ స్టేడియం దగ్గరకు వచ్చి టికెట్స్ అడుగగా వారు లేవని సమాధానం ఇచ్చారు. మరుసటి రోజు మళ్లీ ప్రయత్నించినా కూడా అదే తరహాలో సమాధానం వచ్చింది.

అయితే స్టేడియం ముందు దిగులుగా కూర్చున్న సమయంలో ఒక వ్యక్తి షబ్బీర్ కి కవర్ ఇచ్చాడు. అందులో మ్యాచ్ టికెట్ ఉండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తరువాత టికెట్ పంపింది మహేంద్ర సింగ్ ధోనికి అని తెలియగానే ఎంతో ఆనందపడిపోయా అని షబ్బీర్ మీడియాకు తెలిపాడు. ధోని అంటే అప్పటి నుంచి అభిమానమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ధోని ఫ్యాన్ ఇండియా బాంగ్లాదేశ్ శ్రీలంక మధ్య జరుగుతోన్న ముక్కోణపు టీ20 సిరీస్ చూడటానికి శ్రీలంకకు వెళ్లాడు. అక్కడ మీడియాతో ఈ విషయాన్ని షబ్బీర్ తెలియజేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments