భారీ రేటుకు ధ్రువ సాటిలైట్ హక్కులు ?

Sunday, January 29th, 2017, 09:12:49 PM IST

dhruva
రామ్ చరణ్ హీరోగా నటించిన ”ధ్రువ” సినిమా ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ ‘తని ఒరువన్’ కు రీమేక్ గా రూపొందింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల విడుదలకు ముందే క్రేజీ రేటు కు సాటిలైట్ హక్కులను తీసుకుంటారు .. అయితే అనుకోకుండా ఈ సినిమా సాటిలైట్ హక్కులను ముందుగా అమ్మకుండా ఆపేసారు. అలాగే ఈ సినిమా ఓవర్ సీస్ లోకూడా దుమ్ము రేపింది కాబట్టి .. ఇప్పుడు ధ్రువ సినిమా సాటిలైట్ హక్కులకు గట్టి నెలకొన్న సందర్బంగా ఈ ఫ్యాన్సీ రేటుకు గట్టి పోటీ మధ్య జెమినీ టివి హక్కులు దక్కించుకుంది? ఇంతకీ ఈ సినిమా హక్కులు ఇంతకు అమ్ముడయ్యాయి తెలుసా .. 9. 5 కోట్లట !! మొత్తంగా రామ్ చరణ్ క్రేజ్ ఈ సినిమాతో ఇంకా పెరిగింది మరి !