ఆనందం వ్యక్తం చేస్తున్న” డైలాగ్ కింగ్ మోహన్ బాబు”…” ఫసక్” .

Tuesday, September 4th, 2018, 05:35:30 PM IST

విలక్షణ నటుడు ఎలాంటి డైలాగ్ ని అయినా సరే అవలీలగా తనదైన శైలి లో చెప్పేసే నటుడు ఆయనే “డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు” గారు.

అయితే ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయనని అడిగిన ఒక ప్రశ్న కి ఆయన ఎప్పటి లాగానే తనదైన శైలి లో ఒక మాట అన్నారు. ఆ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సంచలనం గా మారిపోయింది.. ఆ మాటే “ఫసక్”. ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాతి నుంచి ఏ ఫేస్బుక్ గాని ట్విట్టర్ కానీ ఆ డైలాగ్ విపరీతంగా వైరల్ అయ్యింది.. ఎవరైన వారి స్నేహితులు వారిలో వారు సరదాగా మాట్లాడుకున్నా లేదా బిగ్ బాస్ 2 షో కి సంబంధించి ట్రోల్ల్స్ చూసుకున్న ఈ “ఫసక్” అనే డైలాగ్ విపరీతంగా వాడుతున్నారు. అయితే ఈ విషయం ఎలాగో మోహన్ బాబు గారికి తెలిసింది. ఆలా తెలుసుకున్న ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా “నేను చెప్పిన ఈ మాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యినందుకు ఆనందం గా ఉందని ఆ డైలాగ్ మీద కొన్ని వందల ఫన్నీ వీడియోస్ ఫొటోస్ ఉన్నాయని వాటిని చూడమని ఆయన తనయుడు ఐన మంచు విష్ణు గారితో తన ఆనందాన్ని పంచుకున్నారు..

  •  
  •  
  •  
  •  

Comments