చంద్రబాబు అన్ని ఇలాంటి రాజకీయాలు చేశాడా…?

Wednesday, September 18th, 2019, 09:30:56 PM IST

రాజకీయాల పరంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఎంతలా అనుభవం ఉన్నదో మనందరికీ తెలిసిందే. దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 9 ఏళ్ళు పాలించాడు. రాష్ట్ర విభజన తరువాత నవ్యంద్రని 5 ఏళ్ళు పాలించాడు. దానికితోడు కొన్నేళ్ల ప్రతి పక్ష నేతగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి చాలా అనుభవం ఉంది. ఒక రాజకీయ నాయకుడికి ఇంతలా అనుభవం ఉండటం అనేది అసలు ఎవరికీ సాధ్యం కానీ విషయం అని చెప్పాలి. ఇన్నేళ్లు రాజకీయ అనుభవాన్ని సాధించాలంటే చంద్రబాబు ఎంతలా కాస్త పడ్డారో, అంతకు మించి ఎన్ని ఎత్తులు, పై ఎత్తులు వేశారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు.

కాగా కోడెల మరణం తరువాత చాలా మంది రాజకీయ విశ్లేషకులు పలు అంశాలను లేవనెత్తుతున్నారు. కాగా ఇప్పటికి కూడా ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ, కోడెల మరణాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకోవదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడని, తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాగా ఆ విమర్శల్లో భాగంగా సీనియర్ ఎన్టీఆర్, భూమా నాగిరెడ్డి, నందమూరి హరికృష్ణ, కోడెల ను కూడా కావాలనే చంద్రబాబు మానసికంగా వేధించడం వలన మరణించారని కొందరు నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

కాగా పిల్లనిచ్చిన మామనే దారుణమైన వెన్నుపోటు పొడిచి చంపేశారని ఇప్పటికి కూడా కొందరు నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాగా ఇకపోతే భూమా నాగిరెడ్డికి తన పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపించి చివరికి చంద్రబాబు మొహం చాటేశారని, అయితే అలంటి మానసిక వేదన వల్లే నాగిరెడ్డి చనిపోయాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇకపోతే నందమూరి హరికృష్ణ రాజకీయాల్లోకి వచ్చి పూర్తీ సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కి రాజకీయ భవిష్యత్తు పరంగా చాలా అడ్డువస్తాడని భావించి, తనకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా, పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా చివరికి ఆయన చనిపోయాక ఆయన కుమార్తెకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారని, ఇక చివరగా కోడెల శివప్రసాదరావు కి కూడా ఇలాంటి మానసిక క్షోభకి గురిచేశారని, ఆయనని ఇన్నిరోజులుగా రాజకీయంగా వాడుకొని చివరికి ఆయనకీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా మొహం చాటేశారని, అలంటి మానసిక క్షోభ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారని ఇప్పటికి కూడా విమర్శకులు పలు విమర్శలు చేస్తున్నారు.