మహర్షి,అరవింద సమేత..అజ్ఞ్యాతవాసి రికార్డు బ్రేక్ చెయ్యగలరా.?

Monday, September 24th, 2018, 06:40:52 PM IST

పవన్,మహేష్ మరియు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ సినీ చరిత్రలో వీరికి ఒక్కక్కరికి ఉన్న క్రేజే వేరు వీరి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..ఒకవేళ హిట్ టాక్ గాని సంతరించుకుంటే ఇక ఆ ప్రభంజనాన్ని ఎవ్వరు ఆపలేరు.వారి యొక్క అభిమానుల్లో కూడా ఎక్కువగా చర్చకు వచ్చే అంశాలలో ఒకటి వారి చిత్రాలకి వచ్చే కలెక్షన్స్.సినిమా టాక్ ఎలా ఉన్నా సరే మొదటి రోజు మాత్రం వీరి ముగ్గురికి రికార్డు స్థాయిలోనే ఓపెనింగ్స్ వస్తాయి,కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే ఏకంగా బాహుబలి చిత్రానికి వచ్చిన కలెక్షన్ కూడా వీరి స్టామినాతో దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క అట్టర్ ప్లాప్ చిత్రం అయిన అజ్ఞ్యాతవాసి చిత్రం యొక్క మొదటి రోజు రికార్డును వీరి ఇరువులో ఎవరు బ్రేక్ చేస్తారు అన్నది చర్చనీయాంశం అయ్యింది.అజ్ఞ్యాతవాసి చిత్రం ప్రీమియర్స్ తోనే ప్లాప్ టాక్ తెచ్చుకున్నా సరే పవన్ కళ్యాణ్ స్టామినాతో కేవలం ఒక్క రోజులోనే 60.50 కోట్లు గ్రాస్ ని వసూలు చేసింది.ఆ తర్వాత కొంత మంది పెద్ద హీరోల చిత్రాలు విడుదల అయినా సరే ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం భరత్ అనే నేను చిత్రం కూడా అందుకోలేక పోయింది.కానీ ఈ సారి మాత్రం వచ్చే సినిమాలు ఈ రికార్డుని దాటేసేలా ఉన్నాయి.

ఎందుకంటే ఈ సారి ఎన్టీఆర్ మహేష్ ఇద్దరు ఒక సరికొత్త తరహాలో రాబోతున్నారు,ఈ ఇద్దరు ఇప్పటి వరకు చేయని దర్శకులితో తమ స్టామినా చూపించడానికి వస్తున్నారు.త్రివిక్రమ్ ఎన్టీఆర్ కంబినేషన్లో రావడమే ఒక సంచలనం అనుకుంటే ఈ సారి మహేష్ తన కొత్త లుక్ తమ అభిమానులను పలకరించడానికి వస్తున్నారు,దీనితో ఒక్క సరిగా ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి,ఈ సారి మాత్రం వీరిద్దరూ ఒక్క రికార్డును కూడా మిగిల్చేలా లేరు.ఈ సారైనా చూద్దాం పవన్ పేరిట ఉన్న డే వన్ రికార్డును వీరు అధిగమించగలరో లేదో.?