వెండి తెర మీదకు హీరోగా విరాట్ కోహ్లీ..?

Friday, September 21st, 2018, 01:57:27 PM IST

భారత జట్టులో తనదైన శైలి బ్యాటింగ్ స్టైల్ తో కొన్ని కోట్ల మందిని అభిమానులుగా మలుచుకున్నారు జట్టు సారధి విరాట్ కోహ్లీ.అతడు క్రీజులో ఉంటే చాలు విజయం మనదే అన్న భరోసా ఉంటుంది ప్రతీ ఒక్క భారతీయుడికి. క్రికెటర్ గా అరంగేట్రం చేసిన కొద్ది సంవత్సరాల్లోనే ఎన్నో అవార్డులు,విజయాలు రికార్డులు కొల్లగొట్టేసాడు,ఇప్పుడు వెండి తెర రికార్డుల మీద కన్నేశాడా అన్న సందేహం ఐతే వస్తుంది.ఎందుకంటే తాను హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్నాడా అన్న సందిగ్ధంలో పడేసాడు ఈ రన్ మెషిన్.

తాను తన ట్విట్టర్ అకౌంటు ద్వారా మళ్ళీ నా మొదటి సినిమా అన్నట్టుగా ఒక పోస్టర్ని విడుదల చేసాడు.ఆ పోస్టర్ చూడ్డానికి మాటల్లోనుంచి దూసుకువస్తున్న బాణంలా కోహ్లీ దూసుకు వస్తున్నాడు.అది సినిమానా..? లేక ట్రైలరా..?అన్న డైలమాలో పడేసాడు కోహ్లీ.ఆ చిత్రానికి “ట్రైలర్ ది మూవీ” అని పేరు పెట్టారు.నిర్మాణ సంస్థ ఏమో “ది రాంగ్ ప్రొడక్షన్స్” అని పెట్టారు.కొత్త హీరోలను వెండి తెరకు పరిచయం చేసే విధంగా విరాట్ కోహ్లీ ని మీకు పరిచయం చేస్తున్నాం. అంటూ అది అసలు ట్రైలరా.? లేక నిజంగానే కోహ్లీ హీరోగా మారుతున్నాడా? అన్న సందేహం రాకమానదు.ఈ నెల 28వ తారీఖున విడుదల చేస్తున్నాం అన్నట్టుగా తేదీని కూడా పెట్టారు,ఈ పోస్టర్ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ నెల 28వ తారీఖు వరకు ఆగాల్సిందే.