సోనమ్ కపూర్ వెడ్డింగ్ కార్డు చూసారా?

Thursday, May 3rd, 2018, 11:19:59 AM IST

సీనియర్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ బాలీవుడ్ లో సావరియా చిత్రంతో అరంగేట్రం చేసింది. తొలి చిత్రం లోనే రణబీర్ కపూర్తో ఆమె జత కట్టారు. ఆ చిత్రంలో నటనకు మంచి గుర్తింపు లభించడంతో తరువాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరిగా వెలుగుతున్న సోనమ్ కొద్దిరోజుల్లో శ్రీమతి కానున్నారు. గత కొద్దిరోజులుగా సోనమ్, ఆమె మిత్రుడు ఆనంద్ అహుజాను వివాహమాడనున్నారనే వార్తలు షికారు చేసాయి. అంతే కాక వీరిపెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే ఆమె పెళ్లాడనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయమై అహుజా, కపూర్ కుటుంబాలు నోరు మెదపలేదు.

అయితే నేడు ప్రస్తుతం వారిద్దరి పెళ్ళికి ముహూర్తం కుదిరింది. వారి వివాహాన్ని ఘనంగా బంధు, మిత్రుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ వివాహ నిమిత్తం ప్రింట్ చేసిన వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. సోనమ్‌ కపూర్, ఆనంద్‌ ఆహుజాల వివాహం మే 8న ముంబైలో జరగనుంది. అలాగే అదే రోజు రాత్రి పార్టీ కూడా ఎరేంజ్‌ చేశారు. మొత్తానికి సోనమ్ తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త ఆనంద్ ను పెళ్లాడనున్నారనే ఈ వార్త ఆమె అభిమానులను ఆనందపరుస్తోంది. కంగ్రాట్స్ సోనమ్ అంటూ వారు ఇంటర్నెట్ లో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు…..