జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇదే.. సోషల్ మీడియాలో బిగ్ వైరల్.. !

Wednesday, June 12th, 2019, 01:31:30 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్ని ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చే పనిలో ఉన్నారు. అయితే సమయం వృధా చేయకుండా వరుస సమీక్షలు నిర్వహిస్తూ బిజీ బిజీ జీవితాన్ని గడుపుతున్నారు సీఎం జగన్.

అయితే వైసీపీ చేతిలో ఘోరంగా ఓటమి పాలైన టీడీపీపై ఇప్పటికి విమర్శలు తగ్గడంలేదు. అయితే తాజాగా చంద్రబాబు, జగన్ మధ్య ఉన్న తేడా అంటూ వస్తున్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గత ఐదేళ్ళుగా అధికారంలో ఉన్న చంద్రబాబుకు దాహం వేసినప్పుడు తాగే మంచి నీళ్ల బాటిల్ ఖరీదు అక్షరాల 200 రూపాయలట. ఇదంతా సొంత సొమ్ముతో కొంటున్నాడా అంటే అదీ లేదు. సమావేశాలు, సమీక్షలు పెట్టినప్పుడల్లా చంద్రబాబు ముందు హిమాలయ వాటర్ బాటిల్ కనిపించేది. అంతేకాదు చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా అదే ఖరీదైన వాటర్ తాగేవారట. అయితే సమావేశంలో ఉన్న మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం సాదా సీదా వాటర్ బాటిల్ అందించేవారట. అయితే చంద్రబాబు సొంత డబ్బులతో కాకుండా కేవలం తాగేనీరుకే ఇంతలా ప్రజాధనాన్ని వృధా చేశాడని ఇప్పుడు విమర్షలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఎన్నికలలో భారీ మెజారిటితో గెలిచిన వైసీపీ అధినేత సీఎం జగన్ తాజాగా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అందులో జగన్ కేవలం తన ముందు 20 రూపాయల సాదాసీదా వాటర్ బాటిల్‌ను వాడాడని, మిగతా మంత్రుల ముందు ఏ వాటర్ బాటిల్ అయితే ఉంచారో జగన్ కూడా అదే వాటర్ బాటిల్‌ను వినియోగించారని ప్రజాధనాన్ని పొదుపుగా వాడడంలో చంద్రబాబు విఫలమయ్యారని, సీఎం జగన్ సాదాసీదాగా ఉంటూ మరోసారి తన హూందాతనాన్ని నిరూపించుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్‌లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త చంద్రబాబు.. జగన్.. ఓ వాటర్ బాటిల్ అంటూ తెగ వైరల్ అయిపోతుంది.