నాగ చైతన్య వర్సస్ గౌతం మీనన్ .. అసలేం జరిగింది !

Wednesday, November 16th, 2016, 02:43:40 PM IST

naga-chaithanya-gautham-men
గౌతం మీనన్ – నాగ చైతన్య ల కాంబినేషన్ సూపర్ గా వర్క్ అయ్యే కాంబినేషన్. సంవత్సరాల క్రితం తీసిన ఏం మాయ చేసావే దగ్గర నుంచీ ఇప్పుడు విడుదల అయిన సాహసం శ్వాసగా సాగిపో వరకూ వీరిద్దరి కాంబినేషన్ నీ చాలా గొప్పగా చెప్పుకుంటారు. తమిళం లో సింభూ తో తీస్తూ అదే సినిమాని తెలుగు లో చైతన్య తో చేసాడు గౌతం. ఈ సినిమా విడుదల దాదాపు ఏడాది పాటు లేట్ అయినా కూడా మంచి టాక్ తో నడుస్తోంది ఈ చిత్రం. అయితే తెలుగు వెర్షన్ సినిమా మీద , నాగ చైతన్య మీద గౌతం మీనన్ సీరియస్ గా ఉన్నాడు అనీ అందుకే ప్రమోషన్ కూడా చెయ్యట్లేదు అనే ఒక వాదన నడుస్తోంది. పైగా తాజాగా సింభూ చైతన్య కంటే గొప్ప నటుడు అనీ చైతన్య కి పుషింగ్ ఇవ్వాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు గౌతం ఈ విషయం మీద అక్కినేని ఫాన్స్ సీరియస్ అయ్యారు కూడా. ఎట్టకేలకి తెలుగు మీడియా కి వచ్చి తన తెలుగు వెర్షన్ ని ప్రమోట్ చెయ్యడం మొదలు పెట్టిన గౌతం ఈ సందర్భంగా తనకీ చైతన్య కీ ఎలాంటి గొడవలూ లేవు అని చెప్పాడు.‘చైతూతో నా రిలేషన్ చాలా బాగుంది. అతను నాతో తమ్ముడి లాగా ఉంటాడు. తనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ‘ఏమాయ చేసావె’ సమయానికి ఇప్పటికి చైతూ వ్యక్తిగా ఏం మారలేదు. నటుడిగా ఎదిగాడు. అతడితో ఇంకో సినిమా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మరి చైతూకు అలాంటి ఉద్దేశం ఉందో లేదో తెలియదు మరి’’ అన్నాడు గౌతమ్.