వైసీపీలో మొదలైన విభేదాలు – కారణం ఏంటో మరి…?

Monday, June 10th, 2019, 11:40:41 PM IST

ఎట్టకేలకు ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా, మరికొందరు మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. వైసీపీ అధికారాన్ని చేపట్టిన కొద్దీ రోజుల్లోనే జగన్ నాయకత్వం బాగుందని అందరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈలోగా కొందరు నాయకులు మాత్రం వారి సహనాన్ని కోల్పోయి మరీ బహిరంగ వేదికల మీదనే ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకునే స్థాయికి చేరుకున్నారు. వారిరువురి మధ్యలో బహిరంగంగానే మాటల యుద్ధం జరిగింది. కాగా విశాఖ జిల్లా నుండి మంత్రిగా ఎన్నికైన రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు విశాఖలో సన్మానం ఏర్పాటు చేశారు. కాగా నగర వైసీపీ అధ్యక్షుడు బొమ్మనబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆధ్వర్యంలో ఈ సన్మానం జరపడానికి సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ సన్మాన వేదిక మీదే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరినొకరు విమర్శించుకుంటూ పలు వాఖ్యలు చేసుకున్నారు.

అంతేకాకుండా ఇలా ఒకరికొకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం వలన ప్రజల్లో రాంగ్ ఫీడ్ బ్యాక్ వెళుతుందని, ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. కాగా అవంతి శ్రీనివాస్ మన రాష్ట్రానికే మంత్రి అని, అనవసరంగా తనని వాడుకుంటూ ఇలా స్థానిక ఎన్నికల విషయంలో తప్పుపట్టడం సరికాదని అన్నారు. వెంటనే తిరిగి ధర్మశ్రీ మైకు అందుకుని ద్రోణంరాజు మాటలకు విరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను తప్పుడు సంకేతాలిచ్చానని కొంతమంది చెప్పడం విడ్డూరంగా ఉందని, జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపుని దృష్టిలో పెట్టుకుని కూడా అవంతికి మంత్రి పదవి ఇచ్చారని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. ఒకే పార్టీకి చెందిన వీరు ఇలా పరస్పరం తిట్టుకోవడం భావ్యంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.