ఛలో అంటున్న యువ హీరో !

Friday, October 27th, 2017, 05:24:49 PM IST

‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’, దిక్కులు చూడ‌కు రామ‌య్య‌’ ‘ల‌క్ష్మిరావే మా ఇంటికి’ ‘క‌ళ్యాణ‌వైభోగం’ ‘జ్యోఅచ్చుతానంద‌’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగ శౌర్య, ప్రస్తుతం ఈ హీరో వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు, ఐరా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఛలో’ అనే టైటిల్ ఖరారు చేశారు.

నాగ శౌర్య పేరెంట్స్ ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతలు. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో నాగ శౌర్య సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు, ‘ఛలో’ టైటిల్ కూడా వేరే వాళ్ల దగ్గర ఉన్నప్పటికీ కథకు తగ్గట్టుగా ‘ఛలో’ టైటిల్ ఆప్ట్ అని చెప్పగానే వేరే నిర్మాణ సంస్థ వారు టైటిల్ ను నాగ శౌర్యకు ఇచ్చేసినట్లు సమాచారం.