టీడీపీ డిజిటల్ మహానాడు 2020 రాజకీయ సమావేశం సెటప్ చూసారా?

Wednesday, May 27th, 2020, 11:22:03 AM IST


సాంకేతికత పరిజ్ఞానాన్ని తెలుగు దేశం పార్టీ నూటికి నూరుశాతం ఉపయోగిస్తున్నది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ ప్రజలు లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ భౌతిక దూరం పాటిస్తూనే టిడిపి డిజిటల్ మహానాడు 2020 రాజకీయ సమావేశం నిర్వహిస్తుంది.ప్రతి సంవత్సరం భారీ అసంఖ్యాక జన సంద్రోహం మద్య లో జరుపుకొనే ఈ మహానాడు ను లాక్ డౌన్ కారణంగా జూమ్ వెబినార్ ద్వారా ఈ సమావేశం జరుగుతుంది. టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ జూమ్ ఆప్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు.

రెండు రోజులు జరగనున్న ఈ మహానాడు కార్యక్రమ వివరాలను టిడిపి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే భౌతిక దూరం పాటిస్తూనే ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే ఈ సెటప్ చూస్తూనే టీడీపీ కరోనా వైరస్ లాక్ డౌన్ నిబంధనలను ఎంతగా పాటిస్తుందొ తెలుస్తోంది. అయితే మొదటి రోజు అయిదు తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. విద్యుత్ చార్జీల పెంపు,మాట తప్పిన జగన్ అంటూ ఎంపీ కేశినేని నాని, బిటి నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేయనున్నారు.అయితే రెండు రోజులు జరగనున్న ఈ మహానాడు కార్యక్రమం లో తెలంగాణ కి సంబంధించిన అంశాల పై కూడా చర్చించ నున్నారు. మొత్తం అయిదు తీర్మానాల పై మొదటి రోజు సమావేశం జరగనుంది.