మహేష్ బాబు లా ఎదగాలి.. దిల్ రాజు దీవెనలు

Wednesday, October 18th, 2017, 11:58:55 PM IST

రవితేజ కెరీర్ లో ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమా రాజా ది గ్రేట్. ఈ రోజు విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అంతే కాకుండా రవి తేజ కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ ని కూడా అందుకుంది. దీపావళి ఉండడంతో సినిమాకు ఈ వీకెండ్ చాలా ప్లస్ అయ్యేట్లు ఉందంటున్నారు సినీ పండితులు. అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా దీపావళి పండగల సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్బంగా సక్సెస్ మీట్ లో మాట్లాడిన దిల్ రాజు రవి తేజ కొడుకు మహాదన్ గురించి మాట్లాడాడు.

మహాదన్ సినిమాలో చాలా బాగా నటించాడని మొదట అనిల్ రావిపూడి రవితేజ గారి అబ్బాయినే సినిమాలో చిన్నప్పటి క్యారెక్టర్ చేయిద్దామాని నాతో చెప్పినప్పుడు రావి తేజ ఒప్పుకుంటారా? అంటే నేను ఓపిస్తాను అని డైరెక్టర్ అనిల్ తనతో చెప్పాడని దిల్ రాజు చెప్పారు. రవితేజ ఒప్పుకోవడంతో మా సినిమాలో మహాదన్ అద్భుతంగా నటించాడని దిల్ రాజు చెబుతూ.. రవితేజ కొడుకుని మా బ్యానర్ లో లాంచ్ చెయ్యడం మా అదృష్టం గా భావిస్తున్నామని చెప్పారు. అలాగే మహాదన్ కూడా మహేష్ బాబు బాలనటుడిగా ఎలా ఎదిగాడో అలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు దిల్ రాజు చెప్పారు.