కరి ‘కాలా’న్ కు దిల్ రాజు సపోర్ట్ ?

Monday, March 5th, 2018, 09:00:07 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కాలా టీజర్ విడుదలైనప్పటినుండి దాని క్రేజ్ ఓ రేంజ్ లో ఉన్నది. ఇంతవరకు పెద్దగా హవా లేని కాలా సినిమా టీజర్ తో ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ చేసింది. పా రంజిత్ దర్శకత్వంలో కబాలి తరువాత వస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఊపందుకుంటున్నాయి. అయితే కబాలి సినిమా సమయంలో కూడా టీజర్ వచ్చాకా బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ఈ సినిమా తెలుగు హక్కులు అత్యంత భారీ రేటుకు పలకడం .. ఆ సినిమా విడుదల తరువాత పరిస్థితి మరోలా మారడం అందరికి తెలిసిందే.

అందుకే ఆ పరిస్థితి రిపీట్ కావొద్దని కాలా విషయంలో తొందర పడొద్దని అనుకున్నారో ఏమో డిస్ట్రిబ్యూటర్స్. అందుకే పెద్దగా బిజినెస్ పరంగా స్పందన రాకపోవడంతో నిర్మాత ధనుష్ టెన్షన్ పడుతున్నాడట. కానీ కాలా టీజర్ తరువాత ఈ సినిమాను విడుదల చేయడానికి ఓ ప్రముఖ నిర్మాత ముందుకు వచ్చాడట .. అయన ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఈ మధ్య పలు తమిళ సినిమాలను దిల్ రాజుఁ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలా సినిమాను కూడా దిల్ రాజు విడుదల చేస్తున్నాడట. నిజానికి ఓకే బంగారం, చెలియా, పోలీసోడు లాంటి డబ్బింగ్ సినిమాలను విడుదల చేసిన దిల్ రాజు చెలియా ప్లాప్ తరువాత డబ్బింగ్ సినిమా చేయొద్దని అనుకున్నాడట .. కానీ కాలా క్రేజ్ చూసాక ఈ సినిమా విడుదల చేయాలనీ అనుకుని ఈ హక్కులు తీసుకున్నట్టు తెలుస్తోంది. సో త్వరలోనే దిల్ రాజు సమర్పణలో అంటూ పోస్టర్స్ ని విడుదల చేస్తారట.