దిల్ రాజు సూపర్ ప్లాన్..!

Tuesday, September 20th, 2016, 08:01:01 PM IST

dil-raju
దిల్ రాజు అభిరుచి గల నిర్మాతే కాదు. తెలివైన బిజినెస్ మాన్ కూడా.అంతేకాక డిస్ట్రిబ్యూటర్ ఆటను సొతం చేసుకున్న చాలా సినిమాలు అతనికి మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.దిల్ రాజు నిర్మాతగా కూడా విజయం సాధించడానికి కారణం అతను బడ్జెట్ ను అదుపులో ఉంచుకుని సినిమాలు చేయడమే.ఎక్కువ చిత్రాలు అతనికి లాభాలు తెచ్చిపెట్టాయి.

తాజాగా దిల్ రాజు ఓ భారీ డీల్ కు సంబంధించి పెద్ద ప్లాన్ వేసాడు. అతను త్వరలో విడుదల కాబోయో 5 చిత్రాల ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం బిజినెస్ వాల్యూ రూ . 18.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. నేను లోకల్, శతమానం భవతి, ఫిదా, దువ్వాడ జగన్నాథం చిత్రాలతో పాటు హెబ్బా పటేల్ నటిస్తున్న చిత్ర ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకున్నాడు.