దిల్ రాజు ఆసక్తి ఖరీదు .. తొమ్మిదికోట్లు ?

Monday, May 21st, 2018, 12:05:58 PM IST

టాలీవుడ్ లో నిర్మాతగా .. డిస్ట్రిబ్యూటర్ గా మంచి బ్రాండ్ ఏర్పరచుకున్న అయన సినిమాలంటే జనాలకు అదే ఆసక్తి. తమ సినిమాలను దిల్ రాజు విడుదల చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే అన్న ప్రచారం ఉంది. అందుకే ఆయనతో తమ సినిమాలను విడుదల చేయించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దిల్ రాజు జడ్జిమెంట్ పై కూడా గట్టి నమ్మకం ఉంది. ఆయనకు నచ్చితేనే సినిమా తీసుకుంటాడని, అయితే ఈ విషయంలో అప్పుడప్పుడు కథ అడ్డం తిరుగుతుంది .. తాజాగా ఇప్పుడు అదే పరిస్థితి దిల్ రాజుకు ఎదురైంది. తాజాగా అయన పూరి జగన్నాధ్ తెరకెక్కించిన మెహబూబా చిత్రాన్ని నైజాం ఏరియాకు గాను పది కోట్లు పెట్టి తీసుకున్నాడు ..పూరి జగన్నాధ్ మీదున్న నమ్మకమో .. లేక మెహబూబా సినిమా పై ఉన్న ఆసక్తితో , కానీ సినిమా ఉహించినట్టుగా ఉండకపోవడంతో ఫలితం మరోలా ఉండడంతో తీవ్ర నషాలు వాటిల్లాయి. ఆ నష్టం ఖరీదు ఎంతో తెలుసా .. ఏకంగా 9 కోట్లు. సినిమా విడుదలయాయి వారం అవుతున్నా కూడా కనీసం కోటి రూపాయలను కూడా వసూలు చేయలేకపోవడంతో తీవ్ర నషాలు వాటిల్లాయి.

  •  
  •  
  •  
  •  

Comments